( 20 Sep, 2015) విటమిన్లు Published By : upscgk.com » విటమిన్లు శరీరానికి కావలసిన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు. » Vital, Amines అనే పదాల నుంచి 'Vitamins' అనే పదం రూపొందింది. » సర్ హెచ్.జి.హోప్కిన్స్ 1912లో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించారు. » విటమిన్లు అనే పేరును సూచించింది 'ఫంక్'. » విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం 'విటమినాలజీ'. » విటమిన్లు ద్రావణీయత ఆధారంగా 2 రకాలు: 1) కొవ్వులో కరిగే విటమిన్లు 2) నీటిలో కరిగే విటమిన్లు » కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K » నీటిలో కరిగే విటమిన్లు B, C » విటమిన్లు ఎంజైములకు సహ ఎంజైములుగా పనిచేస్తాయి. » ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి. » విటమిన్లు దేహ నిర్మాణంలో కానీ, శక్తినివ్వడంలో కానీ పాలుపంచుకోవు. కానీ దేహంలో జరిగే వివిధ జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. విటమిన్ - ఎ » విటమిన్ A రసాయనిక నామం 'రెటినాల్'. » మరో పేరు 'యాంటీ గ్జెరాఫ్తాల్మిక్ విటమిన్'. » ఇది కంటిచూపునకు తోడ్పడే విటమిన్. » రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. » రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. » మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. » ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ Aగా మారుతుంది. » రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ A ఉండాల్సిన పరిమాణం 750 మి.గ్రా. » విటమిన్ A లోపం వల్ల ప్రతి ఏడాది భారత్‌లో అంధత్వానికి గురయ్యేవారి సంఖ్య 60వేలని ఒక అంచనా. » దీని లోపం వల్ల రేచీకటే కాకుండా వర్ణాంధత్వం కూడా సంభవిస్తుంది. లభ్యమయ్యే పదార్థాలు: బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు (గుమ్మడి పండు, జామ పండు), కాలేయం, వెన్న, టొమాటో » మానవ శరీరం 6 నెలల పాటు విటమిన్ Aను నిల్వ ఉంచుకోగలదు. » జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ Aను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది. » విటమిన్ A లోపించడం వల్ల చర్మం పొడిబారుతుంది. » కనుగుడ్లు ఎండిపోవడాన్ని 'జెరాఫ్తాల్మియా' అంటారు. » విటమిన్ Aకు 'యాంటీ ఇన్ఫెక్టివ్' విటమిన్ అనే మరో పేరు కూడా ఉంది. » నేత్రగోళం మీద కార్నియా శాశ్వతంగా నశించిపోవడాన్ని 'కేరటోమలేసియా' అంటారు. » లాక్రిమల్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఆగిపోవడం వల్ల నేత్రాలు పొడిబారిపోయి జెరాఫ్తాల్మియాకు కారణమవుతుంది. » రేచీకటి వ్యాధినే 'నిక్టిలోఫియా' అంటారు. » కన్ను తెల్ల గుడ్డు మీద తెల్లని చారలు మచ్చల్లా కనిపిస్తాయి. వీటిని బైటాల్ చుక్కలు అంటారు. ఇవి విటమిన్ A లోపం వల్ల ఏర్పడతాయి విటమిన్ - బి విటమిన్ - బి కాంప్లెక్స్ 8 రకాలు 1) విటమిన్ - బి1: » దీని రసాయన నామం 'థయమిన్'. » వాడుక పేర్లు యాంటీ బెరిబెరి, యాంటీ న్యూరైటిస్ విటమిన్. » పాలిష్ చేసిన బియ్యంలో ఈ విటమిన్ లోపిస్తుంది. » హృదయ స్పందన క్రమరహితమవడాన్నే 'బెరిబెరి' అంటారు. » నరాలు బలహీనమవడం, పాక్షిక పక్షవాతాన్నే పాలీన్యూరైటిస్ అంటారు. లభ్యమయ్యే పదార్థాలు: వేరుశనగ, తవుడు, సోయాబీన్స్, దంపుడు బియ్యం, గంజి, బియ్యం, గోధుమ, జొన్నల్లోని పై పొరలు. 2) విటమిన్ - బి2: » దీని రసాయన నామం 'రైబోఫ్లేవిన్'. » వాడుక పేర్లు ఎల్లో విటమిన్, యాంటీ ఖీలోసిస్ విటమిన్, యాంటీ గ్లాసైటిస్ విటమిన్, విటమిన్ G. » ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్-బి2. లోపం వల్ల వచ్చే వ్యాధులు: ఖీలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్. » నోటి మూలలు పగలడాన్ని 'ఖీలోసిస్' అంటారు. » గ్లాసైటిస్లో వల్ల నాలుకపై పూత, నాలుక మంట కనిపిస్తాయి. » ముఖంపై చర్మం పాలిపోవడాన్నే 'డెర్మటైటిస్' అంటారు. లభ్యమయ్యే పదార్థాలు: కొబ్బరి, బార్లీ, జీడిమామిడి, బాదం పప్పు, రాగులు, తవుడు, బొప్పాయి, గుడ్లు, పాలు, కాలేయం, మూత్రపిండం. » పాలను బాగా మరగబెట్టినప్పుడు అవి లేత పసుపు రంగు పొందడానికి కారణం పాలలో రైబోఫ్లేవిన్ ఉండటమే. 3) విటమిన్ - బి3: » దీని రసాయన నామం 'నియాసిన్' లేదా 'నికోటిక్ ఆమ్లం' లేదా 'నికోటినమైడ్'. » వాడుక పేర్లు యాంటీ పెల్లాగ్రా విటమిన్, 4D విటమిన్, సుస్థిర విటమిన్, విటమిన్-PP. » ఇది NDP, ADP సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. » ఈ విటమిన్‌ను ఆక్సీకరణ, ఉష్ణం తేలికగా నాశనం చేయలేవు. లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెల్లాగ్రా, పెదాలు లావెక్కడం, మచ్చలతో, మందమైన చర్మంతో అరిచేతులు తయారవడం. » చర్మం గరుకుగా తయారై, పొలుసులుగా ఏర్పడి ఊడిపోవడాన్ని 'పెల్లాగ్రా' అంటారు. లభ్యమయ్యే పదార్థాలు: ముల్లంగి, బఠాణీ, కాలేయం, ఈస్ట్, చేపలు, వేరుశనగ. 4) విటమిన్ - బి5: » దీని రసాయన నామం 'పాంటోథెనిక్ ఆమ్లం'. » ప్రకృతిలో విరివిగా లభించడం వల్ల దీన్ని 'సర్వ విస్తృత విటమిన్' అంటారు. » గ్రీకు భాషలో పాంటోథస్ అంటే ప్రతిచోటా అని అర్థం. లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, బాలనెరుపు, ఆర్థరైటిస్, బర్నింగ్ఫీట్. » కీళ్లవాతాన్నే ఆర్థరైటిస్ అంటారు. » అరికాళ్లు, అరిచేతుల్లో మంటలు పుట్టడాన్ని 'బర్నింగ్ ఫీట్' అంటారు. లభ్యమయ్యే పదార్థాలు: కాయగూరలు, కాలేయం, గుడ్డు, మాంసం, చిలగడదుంప, చేపలు, పాలు, ఈస్ట్, ధాన్యాలు, పండ్లు. 4) విటమిన్ - బి6: » దీని రసాయన నామం 'పైరిడాక్సిన్'. » వాడుక నామం యాంటీ అనీమియా విటమిన్. » అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో, జీర్ణక్రియలో B6 విటమిన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. » ప్రతిరక్షకాలు, హిమోగ్లోబిన్‌ల ఉత్పత్తిలో పాల్గొంటుంది. లోపం వల్ల వచ్చే వ్యాధులు: అజీర్తి, రక్తహీనత, ఫిట్సు లాంటి వ్యాధులు, కోపం ఎక్కువగా రావడం, అనీమియా, మొటిమలు, చర్మ వ్యాధులు. లభించే పదార్థాలు: గోధుమ, దంపుడు బియ్యం, సోయాచిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలు, గుడ్డుసొన. 5) విటమిన్ - బి7: » దీన్ని విటమిన్ H అంటారు. » సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ ఇది. » 1939లో ఈ విటమిన్‌ను కనిపెట్టారు. » అమైనో ఆమ్లాల, కొవ్వు ఆమ్లాల జీవన క్రియల్లో తోడ్పడుతుంది. » పచ్చిగుడ్డు తాగడం వల్ల శరీరం విటమిన్ B7ను కోల్పోతుంది. » దీని రసాయన, వాడుక నామం 'బయోటిన్'. లోపం వల్ల వచ్చే వ్యాధులు: కండరాల నొప్పులు, అలసట, నాడీ మండలంలో తేడాలు సంభవించడం, మానసిక రుగ్మత, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం, ఆకలి మందగించడం. లభించే పదార్థాలు: చేపలు, మాంసం, సోయాచిక్కుడు, టొమాటో, పాలు, కాలేయం, మూత్రపిండం, గింజలు, కాయగూరలు. 6) విటమిన్ - బి11: » వాడుక నామం 'ఫోలిక్ ఆమ్లం' లేదా 'ఫొలాసిస్'. రసాయన నామం కూడా ఇదే. » దీన్ని M - విటమిన్ అని కూడా అంటారు. » దీన్ని ఎల్లాప్రగడ సుబ్బారావు కనుక్కున్నారు. » గర్భిణీ స్త్రీలకు మొదటిసారిగా ఇచ్చే విటమిన్ ఫోలిక్ ఆమ్లం. » ఈ ఆమ్లం స్పినాక్ పత్రాల నుంచి మొదటిసారిగా లభ్యమైంది. » 'ఫోలియం' అంటే 'పత్రం' అని అర్థం. » కోలిన్, సీరైన్ల సంశ్లేషణలో, న్యూక్లిక్ ఆమ్లాల (DNA, RNA) సంశ్లేషణలో ఫోలిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది. లోపం వల్ల వచ్చే వ్యాధులు: రక్తహీనత, అతిసారం, మానసిక రుగ్మతలు. లభించే పదార్థాలు: మొక్కజొన్న, గోధుమ, మొలకెత్తే గింజలు, ఆకుకూరలు, ధాన్యాలు, ఫలాలు, పాలు, గుడ్డు, మాంసం, కాలేయం. 7) విటమిన్ - బి12: » దీని రసాయన నామం 'సయనకోబాలమిన్' » దీని మరో రసాయన నామం 'కోబాలమిన్' » దీన్నే 'యాంటీ ఫెర్నీషియస్ ఎనీమియా' విటమిన్ అంటారు. » నీలి రంగులో ఉంటూ కోబాల్ట్ (Co) అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది. » ఇది కేంద్రకామ్లాల సంశ్లేషణలో, ఎర్ర రక్తకణాలు ఏర్పడడానికి, యాంటీబాడీల ఉత్పత్తికి, నాడీ కణపు మైలిన్ తొడుగు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెర్నీషియస్ అనీమియా, మాక్రోసైటిక్ అనీమియా, బాలింతల్లో పాల ఉత్పత్తి కుంటుపడుట, హానికర రక్తహీనత. లభించే పదార్థాలు: కోడిమాంసం, పాలు, గుడ్డు, కాలేయం. విటమిన్ - సి » దీని రసాయన నామం 'ఆస్కార్బిక్ ఆమ్లం'. » దీని వాడుక నామం 'యాంటీ స్కర్వీ విటమిన్'. » గాయాలు త్వరగా మానడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. » కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. » దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. » దీని లోపం వల్ల రక్తనాళాలు పెళుసుగా అవుతాయి. చిగుళ్లు చిట్లి రక్తస్రావం జరుగుతుంది. » స్కర్వీ వ్యాధిని 'సెయిలర్స్ డిసీజ్' అని కూడా అంటారు. లభించే పదార్థాలు: సిట్రస్ జాతి ఫలాలు (నిమ్మ, ఉసిరి), జామకాయలు, టొమాటో, ఆకుకూరలు. విటమిన్ - డి » దీని రసాయన నామం 'కాల్సిఫెరాల్'. » వాడుక నామాలు సన్‌షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్, యాంటీ రికెటింగ్ విటమిన్. » అన్నవాహిక నుంచి కాల్షియం, ఫాస్ఫరస్లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడటానికి, గట్టిపడటానికి తోడ్పడుతుంది. » సూర్యరశ్మిలోని UV కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్టరాల్ విటమిన్ Dగా తయారవుతుంది. » చిన్న పిల్లల్లో విటమిన్ D లోపం వల్ల రికెట్స్, పక్షి లాంటి ఛాతీ, రాకిటిక్ రోజరీ అనే వ్యాధులు వస్తాయి. » పెద్దవారిలో ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధులు వస్తాయి. » దొడ్డికాళ్లు, ముట్టికాళ్లు ఏర్పడడాన్ని 'రికెట్స్' అంటారు. » పక్కటెముకల్లో బుడిపెలు ఏర్పడటాన్ని రాకిటిక్ రోజరీ అంటారు. లభించే పదార్థాలు: సూర్యరశ్మి, కాడ్, షార్క్ చేపల కాలేయనూనె, పాలు, క్యాబేజీ, గుడ్డు (పచ్చసొన). » ప్రపంచంలో 80% మంది డి-విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక తెలుపుతోంది. విటమిన్ - ఇ » దీని రసాయన నామం 'టోకోఫెరాల్'. » వాడుకనామాలు 'బ్యూటీ విటమిన్', 'యాంటీ స్టెరిలిటీ విటమిన్'. » త్వచాల నిర్మాణానికి, యాంటీ ఆక్సిడెంట్‌గా, కొటోజెనెసిస్, లైపోజెనెసిస్ ఆక్సీకరణ ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణకు, ముఖంపై ముడుతలు రాకుండా ఉండటానికి E విటమిన్ ఉపయోగకరం. లోపం వల్ల వచ్చే వ్యాధులు: కండరాల క్షీణత, ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమవడం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో రుతుస్రావం, గర్భస్రావం. లభించే పదార్థాలు: సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, పామ్ ఆయిల్, గోధుమ, చిలగడ దుంపలు, పొద్దు తిరుగుడు గింజల నూనె, ఫలాలు. విటమిన్ - కె » దీని రసాయన నామం 'నాఫ్తోక్వినోన్' లేదా 'ఫిల్లోక్వినోన్'. » వాడుక నామాలు రక్త స్కందన విటమిన్, రక్త స్రావక నిరోధక విటమిన్ (కొయాగ్యులేషన్ విటమిన్). » ప్రోథ్రాంబిన్ ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది. » రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది. లోపం వల్ల వచ్చే వ్యాధులు: గాయాలైనప్పుడు ఆగని రక్తస్రావం, పిల్లల్లో పచ్చ కామెర్లు. » విటమిన్ Kను కనుక్కున్నవారు డాయిసీడాం. లభించే పదార్థాలు: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు, ఆకుకూరలు, ఆవు పాలు, టొమాటో. » ఆపరేషన్ చేయడానికి ముందు రోగికి, ప్రసవానికి ముందు తల్లికి కె విటమిన్‌ను ఇస్తారు. * శరీరంలో విటమిన్లు మితిమీరి చేరితే కొన్ని విశిష్ట రోగ లక్షణాలు ఏర్పడతాయి. విటమిన్లు ఎక్కువైన స్థితిని 'అతి విటమినీయ స్థితి' అంటారు. * సి విటమిన్ ఎక్కువైతే గౌట్ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. * డి విటమిన్ ఎక్కువైతే మృదుకణజాలం అస్థీకరణ చెందుతుంది.