( 20 Sep, 2015) ప్రముఖ వ్యక్తులు నినాదాలు Published By : upscgk.com జాతీయ వ్యక్తులు: నినాదం వ్యక్తి » గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి) - స్వామి దయానంద సరస్వతి » నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను - సుభాష్ చంద్రబోస్ » ఢిల్లీ చలో - సుభాష్ చంద్రబోస్ » జైహింద్ - సుభాష్ చంద్రబోస్ » జై జవాన్, జై కిసాన్ - లాల్ బహదూర్ శాస్త్రి » సత్యం, అహింస నాకు దేవుళ్లు - మహాత్మా గాంధీ » డూ ఆర్ డై (చేయండి లేదా చావండి) - మహాత్మా గాంధీ » బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం - మహాత్మా గాంధీ » బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది - మహాత్మా గాంధీ » సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది - మహాత్మా గాంధీ » ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ - స్వామి దయానంద సరస్వతి » భారతదేశం, భారతీయుల కొరకే - స్వామి దయానంద సరస్వతి » ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి - లాలా లజపతిరాయ్ » కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు - లాలా లజపతిరాయ్ » ముందుకు సాగండి - మేడం బికాజికామా » నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి - సర్దార్ వల్లభాయ్ పటేల్ » రోజ్‌గార్ బడావో - మన్మోహన్సింగ్ » జై విజ్ఞాన్ - అటల్‌బిహారి వాజ్‌పేయి » భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు - సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ » రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది - అరబిందో ఘోష్ » ప్రజలే ప్రభువులు - లోక్‌సత్తా » ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు - జవహర్లాల్ నెహ్రూ » ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం - జవహర్లాల్ నెహ్రూ » చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది - జవహర్ లాల్ నెహ్రూ » ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం - శ్రీశ్రీ » భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే - ఎం.కె. ధింగ్రా » ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) - భగత్‌సింగ్ » స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను - బాలగంగాధర తిలక్ » దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను - బాలగంగాధర తిలక్ » పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు - గోపాలకృష్ణ గోఖలే » ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు - రాజారామ్మోహన్రాయ్ » కళ కళ కోసం కాదు ప్రజల కోసం - బళ్ళారి రాఘవ » గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది - భోగరాజు పట్టాభి సీతారామయ్య » దేశ్ బచావో, దేశ్ బనావో - పి.వి.నరసింహారావు » వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం - గుర్రం జాషువా » ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం - వి.డి.సావర్కర్ » నా తెలంగాణ కోటి రతనాల వీణ - దాశరథి కృష్ణమాచార్యులు » బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి - బాజీరావు I » చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి - ఎ.పి.జె. అబ్దుల్ కలాం » పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి - మోతీలాల్ నెహ్రూ » నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను - ఇందిరాగాంధీ » అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో - కందుకూరి వీరేశలింగం పంతులు » బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు - మౌలానా అబుల్ కలాం ఆజాద్ » ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు - మౌలానా అబుల్ కలాం ఆజాద్ » బికారీ హఠావో - రాజీవ్ గాంధీ » వాణి నా రాణి - పిల్లలమర్రి పినవీరభద్రుడు » బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు - టిప్పుసుల్తాన్ » సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి - రవీంద్రనాథ్ ఠాగూర్ » స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు - రవీంద్రనాధ్ ఠాగూర్ » అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి - సి.నారాయణరెడ్డి » కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము - బి.ఆర్. అంబేడ్కర్ » మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు - గురు రామదాస్ » మానవులందరూ నా బిడ్డలవంటివారు - అశోకుడు అంతర్జాతీయం వ్యక్తులు: నినాదం వ్యక్తి » స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది - హిట్లర్ » స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్య్రం అలాంటిది - ముస్సోలిని » వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం - ముస్సోలిని » ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది. ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది - కన్ఫ్యూషియస్ » నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను - జూలియస్ సీజర్ » నాలెడ్జ్ ఈజ్ వపర్ - జె.ఎల్.మిల్ » భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించినవాడవుతాడు - మాల్థస్ » ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ - అరిస్టాటిల్ »ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది - అరిస్టాటిల్ » నేనే రాజ్యాన్ని - లూయి XIV » నా తర్వాత ప్రళయం వస్తుంది - లూయి XV » స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధించబడ్డాడు - రూసో » బ్యూటీ ఈస్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ బ్యూటీ - జాన్‌కీట్స్ » నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళ్లు అర్పించడానికి వచ్చాను - మార్టిన్ లూథర్ కింగ్ » బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది - అబ్రహం లింకన్ » నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు - అబ్రహం లింకన్ » ఇవ్వడానికి నా దగ్గర ఏమీలేదు. రక్తం, శ్రమ, కన్నీళ్లు తప్ప - విన్స్టన్ చర్చిల్ » లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం - గార్డెన్ చైల్డ్ » శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది - రాబర్ట్ స్టీల్ » మతం మత్తుమందు వంటిది - కారల్‌మార్క్స్ » పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప - కారల్ మార్క్స్ » చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు - కారల్‌మార్క్స్ » ప్రపంచ కార్మికులారా ఏకంకండి - కారల్ మార్క్స్ » అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది - సెయింట్ అగస్టీన్ » జన్మతః బ్రిటిష్‌వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే - కారన్వాలిస్ » నూరు పువ్వులు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ - మావో సేటుంగ్ » నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని - నెపోలియన్ » అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం - నెపోలియన్ » ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్‌లోనే ఉద్భవిస్తాయి - నెపోలియన్ » చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం. దానికి మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాలు పెత్తనం అంతమవుతుంది - నెపోలియన్ » సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను - నెపోలియన్ » పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు - నెపోలియన్ » గివ్ మి స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఐ షల్ లిఫ్ట్ దిస్ ఎర్త్ - ఆర్కిమెడిస్ » భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిప్యతంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు - రష్యా పీటర్ చక్రవర్తి » ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం - గోరింగ్ (హిట్లర్ అనుచరుడు) » కంటికి కన్ను పంటికి పన్ను - బాబిలోనియా నాగరికత » రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది - జేమ్స్ I » యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ - మిరాబో » ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్టు పిరమిడ్లు వెలవెలబోతాయి - వోల్టెర్ » సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం - జె.ఎల్. మిల్ » ఈ సెబాస్టపోల్ బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది - కౌంట్ కవూర్ » నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను - కౌంట్ కవూర్ » ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే మానవ అస్థిపంజరాలు, పుర్రెలు, శిలాజాలు అనే ఆధార వస్తువుల్ని ప్రాచీన కాలం మనుషులుగా వర్ణించవచ్చు - మార్టిమర్ వీలర్ » ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో - రెండో కైజర్ విలియం » నేను న్యాయాన్ని ప్రేమించాను, అన్యాయాన్ని నిరసించను. అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను - గ్రేగరి VII » విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతంలాంటిది, పుట్టుకురుపు వంటిది - ఎటర్నిక్ » మానవ పరిణామ క్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది